KMM: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో BRS పార్టీ విజయం కోసం నాయకులు సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని సప్తపది ఫంక్షన్ హాల్లో బుధవారం జిల్లా స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. పార్టీ బలాన్ని మరింత విస్తరించాలని సూచించారు.