PPM: అంతర్జాతీయ వన్యప్రాణి వారోత్సవాలలో భాగంగా కొమరాడ మండలం కోటిపాం జడ్పీహెచ్ స్కూల్లో విద్యార్థులకు పార్వతీపురం రేంజ్ మణికంఠ ఆధ్వర్యంలో డ్రాయింగ్ కాంపిటేషన్ను బుధవారం నిర్వహించారు. కాంపిటేషన్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం వన్యప్రాణులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వన్యప్రాణులు రక్షించుకోకపోతే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు.