VZM: నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా కలుషిత నీటివల్ల వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున నీరు మరిగించి తాగడం, భోజనం ముందు చేతులు కడగడం, పరిసరాల పరిశుభ్రత పాటించడం వంటి చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.