SKLM: వంశధార కాలువను ఇచ్చాపురం వరకు పొడిగించి ఈ ప్రాంత భూములకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని వంశధార సాగునీరు సాధన కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మందస మండలం పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి, రైతు సంఘ నాయకులు వడ్డే శోభనాధీశ్వరరావు, మాజీ ప్రభుత్వ సలహాదారులు మహదేవ్ లకు బుధవారం మందస (M) హరిపురం మార్పు గ్రంథాలయం వద్ద వినతిపత్రాన్ని అందజేశారు.