SRPT: రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చివరి గింజ వరకు ధాన్యం సేకరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కొనుగోలు కేంద్రాల ఇంచార్జీలను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్‌కి సంబంధించి ధాన్యం కొనుగోలుపై ఇవాళ సూర్యాపేట కలెక్టరేట్లో ఐకేపీ పీఎసీఎస్, ఎఫ్‌పీవో, మెప్మా శాఖలకు చెందిన కొనుగోలు కేంద్రాల ఇంచార్జీలతో సమావేశం నిర్వహించారు.