WGL: వరంగల్ పెరుకవాడ ప్రాంతానికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంబాడీ రవీందర్ సంవత్సరిక కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు ఆయన నివాసానికి చేరుకొని, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి తెలియజేశారు.