అనంతపురం జిల్లా స్థాయి SGF తైక్వాండో పోటీల్లో తాడిపత్రి క్రీడాకారులు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్–14 విభాగంలో నివిశ్రీ, దీపిక, లోకేష్ గౌడ్, గౌతమ్, తబ్రేజ ఎంపికయ్యారు. అండర్–17 విభాగంలో నాగమోక్షిత, జశ్విత, అనిల్ కుమార్, సమద్దాని, షేక్షావలి, సాయి నరసింహారెడ్డి ఎంపికయ్యారని కోచ్ సాయిబాబా తెలిపారు.