VZM: జిల్లాలోని అన్ని వసతి గృహాలలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం విద్యాశాఖ అన్ని విభాగాల అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులకు త్రాగటానికి వేడి నీరు మాత్రమే సరఫరా చేయాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు.