TG: బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తరపున బలమైన వాదనలు జరిగాయి. ‘అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లను సమర్థించాయి. చట్టాన్ని ఎవరూ ఛాలెంజ్ చేయలేదు చట్టం ద్వారా చేసిన జీవోలను ఛాలెంజ్ చేశారు. రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 50 శాతం దాటకూడదని రాజ్యాంగంలో లేదు. సుప్రీంకోర్టు ఆదేశం మాత్రమే ఉంది’ అని వాదించింది.