మేడ్చల్: చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో ట్రైన్ నెంబర్ 12791 సహా మొత్తం 18 రైళ్ల తాత్కాలిక రైల్వే స్టాప్ కొనసాగింపు ఉంటుందని అధికారులు తెలిపారు. పండుగ రద్దీ కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో తగిన నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. మరోవైపు రద్దీకి తగ్గట్లుగా టికెట్ కలెక్టర్లు దాదాపు 24 మంది ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.