GNTR: పాత గుంటూరు 8వ డివిజన్లో జీఎంసీ అధికారులు దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బుధవారం ఆ డివిజన్లోని లాల్ బహదూర్ నగర్, పాత శివాలయం వీధి, బొడ్రాయి సెంటర్, కట్టా వారి వీధుల్లో ఇంటింటికి వెళ్లి గాబుల్లో పేరుకుపోయిన పాచి నీళ్ళను తొలగించి, దోమల నివారణ మందులను స్ప్రే చేశారు. నిలువ నీళ్లు ఉండకుండా చూడాలని స్థానికులు అధికారులకు తెలిపారు.