NLR: కొడవలూరులోని ఎస్సీ కాలనీ నందు జరుగుతున్న పారిశుద్ధ్య పనులను జిల్లా పరిషత్ సీఈఓ మోహన్ రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరిస్తున్నారా లేదా అనే విషయాన్ని అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు. తడి చెత్త పొడి చెత్త గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.