మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యువత కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన క్రీడా ప్రాంగణాలు అధ్వానంగా మారాయి. ప్రస్తుతం పిచ్చి మొక్కలతో నిండిపోయి, పశువుల మేత స్థలంగా తయారయ్యాయి. అధికారులు వెంటనే స్పందించి, ఈ ప్రాంగణాలను శుభ్రం చేసి, వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.