TG: నోటిఫికేషన్ విడుదలైనా రిజర్వేషన్లు 50 శాతం మించితే ఎన్నికలు రద్దవుతాయనే నిబంధన ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ట్రిపుల్ టెస్టు పాస్ కాకుండానే రిజర్వేషన్లను ప్రభుత్వం పెంచిందని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పును అతిక్రమించారని పేర్కొన్నారు. ఎంపిరికల్ డేటా కూడా సరిగా లేదన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.