ప్రధాని మోదీకి మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. పాలనాధిపతిగా 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానికి విషెస్ చెప్పారు. దేశ సేవలో మోదీ చూపిన అంకితభావం, పట్టుదల, నిబద్ధతను జగన్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు మరింత శక్తి, విజయాలు కలగాలని ఆకాంక్షిస్తున్నట్లు ‘X’లో పోస్ట్ చేశారు. మోదీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.