NGKL: పదర మండలం చిట్లంకుంట గ్రామం పరిధిలోని పెట్రాల్ చేను గ్రామ యువత ఎన్నికల్లో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు అంటే మద్యం, డబ్బు పంపిణీకి అలవాటు పడిన సంస్కృతికి భిన్నంగా, గ్రామంలో ఎవరూ డబ్బు, మద్యం పంచొద్దని హుకుం జారీ చేశారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. యువత తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు అభినందించారు.