GNTR: తెనాలికి చెందిన వైసీపీ మైనార్టీ నాయకుడు సయ్యద్ దౌలత్ (49) మృతి చెందారు. మారేసుపేట మఠంబజారులోని నివాసంలో బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. తెనాలి వైసీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు అయన సన్నిహితంగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. దౌలత్ మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేశారు.