కృత్రిమ మేధస్సు (AI) అద్భుతమైన అవకాశాలు ఇస్తున్నప్పటికీ, మోసాలకు ఆయుధంగానూ మారుతోందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘నా డీప్‌ఫేక్ వీడియోలనే ఆన్లైన్లో చాలా చూశాను. AIని ఉపయోగించి గొంతులను అనుకరించి, ప్రజల నుంచి పెట్టుబడులు రాబడుతున్నారు. కొత్త తరం మోసాలను అడ్డుకోవాలంటే మన రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలి’ అని ఆమె చెప్పారు.