తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. నవంబర్ 28వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇది ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర కావడం విశేషం. ముదోల్ నుంచి ప్రారంభించనున్నారు. నిర్మల్, ఖానాపూర్, వేములవాడ, చొప్పదండి నియోజక వర్గాల మీదుగా కరీంనగర్ వరకు సాగనున్న ఈ యాత్ర డిసెంబర్ 15 లేదా 16 న ముగియనున్నది.
ఇక ఈ నెల 26 నుండి వచ్చే నెల 14 వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నది. మెదక్ , దుబ్బాక,అందొల్, జహీరాబాద్,గద్వాల్, నాగర్ కర్నూల్,చేవెళ్ల, పరిగి,తుంగతుర్తి,పరకాల , వర్దన్న పేట,ములుగు, పాలేరు, ఇల్లందు, సిరిసిల్ల,మంథని,ఆసిఫాబాద్ కాగజ్ నగర్ లలో బైక్ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
అలాగే ఈ నెల 26,27 తేదీల్లో బిజెపి జిల్లా కార్య వర్గ సమావేశాలు జరపాలని కూడా నిర్ణయం తీసుకోవడమే కాక ఈ నెల 26,27 తేదీల్లో వచ్చే నెల 3,4 తేదీల్లో ఓటరు నమోదు కార్యక్రమం, ఈ నెల 26,27 తేదీల్లో బిజెపి జిల్లా కార్య వర్గ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక భైంసాలో పాదయాత్ర ప్రారంభ సభ నిర్వహిస్తామని తెలిపారు.
ఇక ఈ సందర్భంగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళనంటే వెళతారనే అర్థం అని అన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న వారిని చెప్పుతో కొట్టాలని బండి సంజయ్ విమర్శించారు. నియోజకవర్గంలో లక్ష ఓట్లు లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.