ELR: లింగపాలెం మండలం సుందరరావు పేట గ్రామంలో “పల్లె నిద్ర కార్యక్రమంను పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ క్రాంతి కుమార్, ఎస్సై వెంకన్నతో పాటు పోలీసు సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అనంతరం గ్రామ ప్రజలతో గ్రామంలో ఉన్న సమస్యలపై ప్రత్యక్షంగా చర్చించారు. చట్టాలపై అవగాహన కల్పించడం, ప్రజల్లో చైతన్యం పెంపొందించడం లక్ష్యంగా వివిధ అంశాలపై వివరించారు.