ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గం వైసీపీ నాయకుడు మాదినేని ఉమామహేశ్వర నాయుడు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తనను సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా నియమించడంపై శ్రీవారి ప్రతిమను అందజేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించినట్లు ఆయన తెలిపారు.