సత్యసాయి: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్కాట్లాండ్ దేశం హైల్యాండ్స్లోని ఫోర్ట్ విలియమ్స్ ప్రాంతాన్ని సందర్శించారు. స్థానిక సుందర దృశ్యాలను ఆహ్లాదకరంగా తిలకించారు. ప్రాంత సంస్కృతి, పర్యాటక ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. స్థానికులతో మాట్లాడి పర్యాటక అభివృద్ధిపై చర్చించారు. జిల్లాలో పర్యటకం అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకొవాలని కూటమి ప్రభుత్వాన్ని సూచించాడు.