VSP: గాజువాక నియోజకవర్గంలోని పెదగంట్యాడలో మంగళవారం జరిగిన వీల్ ఆఫ్ ఫైర్ స్కేటింగ్ క్లబ్ కార్యక్రమంలో ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ – మొల్లి పెంటిరాజు పాల్గొన్నారు. విశాఖ జిల్లా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లాస్థాయి పోటీలలో పతాక విజేతలైన పెదగంట్యాడ విద్యార్థులను ఆయన అభినందించారు.