KDP: జమ్మలమడుగు మండలం అంబవరంలో పశువుల షెడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు అదనపు ఆదాయం పొందేలా ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. ఈ మేరకు పశువుల సంరక్షణకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ఈ షెడ్లు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. అనంతరం గ్రామ అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.