PPM: పాలకొండ రేంజ్ సిబ్బంది ఆధ్వర్యంలో సీతంపేట మండలం కడగండి పంచాయతీ వొండ్రుజోల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల నందు అటవీ శాఖ సిబ్బంది వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహించారు. విద్యార్ధులకు వన్యప్రాణుల ఆవశ్యకత, రక్షణ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారి సోమేశ్వరరావు, బీట్ అధికారులు జాకీర్ అలీబేగ్, ప్రశాంతి పాల్గొన్నారు.