NGKL: కల్వకుర్తి మండలం రామగిరిలో విద్యుత్ షాక్తో ఐదు గొర్రెలు మృతి చెందాయి. గ్రామంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న పచ్చిక బయలు భూమిలో సోమవారం సాయంత్రం గొర్రెల కాపరి వాడాల హనుమంతు గొర్రెలను మేపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కంచె లేని ట్రాన్సఫార్మర్ తగిలి ఐదు గొర్రెలు అక్కడికక్కడే చనిపోయాయని కాపరి తెలిపాడు.