NDL: నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రమేష్ బాబు డిమాండ్ చేశారు. జుపాడుబంగ్లా మండలంలోని గ్రామల్లో తడిసి ముద్దయిన మొక్కజొన్న ధాన్యాన్ని నేడు పరిశీలించి, రైతులతో మాట్లాడారు. రైతులు దళారీల చేతిలో నష్ట పోకుండా మద్దతు ధర క్వింటా రూ.3 వేలు పెంచి, అన్నదాతలను ఆదుకోవాలని కోరారు.