NLG: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. నాన్ ఆయకట్టు శాలిగౌరారం, తిప్పర్తి, NLG, కట్టంగూర్ మండలాల్లో ముందస్తుగా నాట్లు వేసిన పొలాలు ప్రస్తుతం చేతికి రావడంతో రైతులు కోతలు కోసి ధాన్యాన్ని సమీపంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రాంతాలకు తరలిస్తున్నారు. కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.