KMM: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2025-26 ఏడాదికి గాను పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయి. జాతీయ కోటాలో 15 సీట్లు భర్తీ కాగా, రాష్ట్ర స్థాయి కోటా కింద కేటాయించిన 85 సీట్లలో సోమవారం నాటికి విద్యార్థులు చేరారు. వంద సీట్లలో సగం మంది జిల్లాకు చెందిన వారే ఉండడం విశేషం. త్వరలోనే మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.