NLR: రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కెఎస్ జవహర్ ఈనెల 7, 8వ తేదీలలో జిల్లాలో పర్యటించనున్నారు. 7వ తేదీ రాత్రి 08:00 గంటలకు నెల్లూరు చేరుకుని బస చేస్తారు. 8వ తేదీ ఉదయం నెల్లూరుకు చెందిన ఎస్సీ నాయకుడు జర్నీ రమణయ్యను కలుస్తారు. అనంతరం ఉదయం 10:15 గంటలకు కడపకు బయలుదేరి వెళతారు. ఈ విషయాన్ని సమాచార శాఖ అధికారులు వెల్లడించారు.