KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధి 46వ డివిజన్ జూబ్లిపురలో సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, సారథినగర్ వద్ద రామాలయం సమీపాన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించనున్నారు. కావున పార్టీ శ్రేణులు గమనించి మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని క్యాంపు కార్యాలయ సిబ్బంది కోరారు.