MBNR: బాలానగర్ మండల కేంద్రం రూపురేఖలు త్వరలో మారిపోనున్నాయి. బాలానగర్ నుంచి పెద్ద రేవల్లి, తిరుమలగిరి, గంగాపూర్ వరకు డబుల్ బీటీ రోడ్డు పనులు 60 శాతం పూర్తయ్యాయి. ముఖ్యంగా పెద్ద రేవల్లి, గౌతాపూర్, పెద్దాయపల్లి గ్రామాల మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధం కావడంతో, మండలంలో అభివృద్ధి పరుగులు తీసే అవకాశం ఉందని పలువురు అన్నారు.