VSP: ఆనందపురం మండలం తరువాడ గూగుల్ డేటా సెంటర్ భూసేకరణకు వ్యతిరేకంగా దళిత రైతులు నిరసన వ్యక్తం చేశారు. తమ జీవనాధారమైన భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని స్పష్టం చేశారు. భూసేకరణపై రెవెన్యూ అధికారులు గ్రామసభ నిర్వహించగా, ఆర్డీఓ సంగీత్ మాధుర్ సమక్షంలో రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.