ADB: జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. ఆయా కాలనీల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మల వద్ద రాత్రి వేళల్లో మహిళలు, యువతులు ఆడుతూ పాడుతూ సందడి చేస్తున్నారు. పౌర్ణమి రోజు పాలల్లో చందమామను చూసే పద్ధతిని వీరు అనుసరిస్తారు. ఇందులో భాగంగా సోమవారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో ఆయా కాలనీల్లో బతుకమ్మల వద్ద మధ్యలో పాలను ఉంచి అందులో చందమామ చూశారు.