AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరలో జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ముందుగా పార్వతీపురం జిల్లాలో పర్యటించనున్నారు. కురుపాంలో గురుకుల పాఠశాలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం షెడ్యూల్ సిద్ధం చేస్తోంది.