SRD: దశదిన కర్మ సందర్భంగా విషాద ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భాగయ్య (55) నీటిలో పడి మృతి చెందాడు. ఈ నెల 5న దశదిన కర్మ సందర్భంగా ఆయన గుండు చేయించుకొని స్నానం చేసేందుకు గ్రామంలోని నీటికుంట దగ్గర ఎవరికీ చెప్పకుండా వెళ్లాడు. బంధువులు విచారణ చేసినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. సోమవారం సాయంత్రం నీటిలో మృతదేహం కనిపించింది.