TG: ఈ నెల 8న మెదక్ జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనుంది. మెదక్, నిజాంపేట, రామాయంపేట, హవేలీఘనపూర్, పాపన్నపేటలో కేంద్ర బృందం సభ్యులు పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నారు. ఈ పర్యటన ఎన్నికల నిబంధనలకు లోబడి కొనసాగనుంది. ఆర్థిక, వ్యవసాయ, R&B, గ్రామీణాభివృద్ధిశాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాల అధికారులు ఉంటారు.