SDPT: కొండపాక మండలం కొమురవెల్లి కమాన్ వద్ద రోడ్డుపై బుట్టలు పెట్టి సీతాఫలాలను విక్రయిస్తున్న వ్యాపారులకు ట్రాఫిక్ సీఐ ఎం. మురళీ కౌన్సిలింగ్ ఇచ్చారు. రోడ్డుపై బుట్టలు పెట్టి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. రోడ్డు పక్కన వ్యాపారాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున, ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.