AP: కల్తీ మద్యంపై విమర్శించే అర్హత మాజీ CM జగన్‌కు లేదని మంత్రి లోకేష్ అన్నారు. కల్తీ మద్యం తయారీదారులను పట్టుకున్నదే తమ ప్రభుత్వం అని చెప్పారు. నిందితుల్లో ఇద్దరు TDP నేతలుంటే వారిని సస్పెండ్ చేశామని తెలిపారు. ఐదేళ్లలో మీరేం చేశారో మరిచిపోయి విమర్శలు చేయొద్దని YCP నేతలకు సూచించారు. జే బ్రాండ్స్‌తో వేలాదిమంది ప్రాణాలను తీశారంటూ మండిపడ్డారు.