KMR: గాంధారిలో తాళం వేసిన ఇంట్లో గుర్తులు వ్యక్తులు చొరబడి నగదుతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన బైక్ మెకానిక్ బాబు ఆదివారం ఇంటికి తాళం వేసి తన కుటుంబ సభ్యులతో ఇతర గ్రామానికి వెళ్లినట్లు తెలిపారు. సోమవారం ఆయన ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేశారు.