KRNL: ఆదోని జిల్లా సాధన జేఏసీ తరఫున ఆదోని జిల్లా ఏర్పాటుకై మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని కోరుతూ మున్సిపల్ ఛైర్మన్ లోకేశ్వరి నాగరాజుకు ఇవాళ వినతి పత్రం అందజేశారు. కౌన్సిల్లో తప్పకుండా చర్చించి తీర్మానం చేసి పంపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదోని జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ నూర్ అహ్మద్, కోదండ తదితరులు ఉన్నారు.