W.G: పాలకోడేరులోని జిల్లా ఎస్పీ పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే మొత్తం 16 అర్జీలను స్వీకరించి వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు.