MNCL: ఆరు నెలల పెండింగ్ వేతనాలు, బిల్లులు చెల్లించాలని దండేపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన నిర్వహించారు. సోమవారం వారు దండేపల్లిలోని ఎంఈవో కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఆరు నెలలుగా వేతనాలు భోజనపు బిల్లులు రావడంలేదని, దీంతో కిరాణా దుకాణాల్లో బాకీ పెరిగిపోయి సరుకులు ఇవ్వడం లేదన్నారు.