VZM: కొత్తవలస వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయానికి సొంత స్థలం కేటాయించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చొక్కాకుల మల్లునాయుడు MPDO రమణయ్యకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతానని ఎంపీడీవో హామీ ఇచ్చారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ కార్యదర్శి విజయబాబు ఉన్నారు.