NZB: జిల్లాలోని ఆయా మండలాలో గల అసైన్డ్ భూములు,భూదాన్,ప్రభుత్వ భూముల సర్వేను పక్కాగా జరిపించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నేడు కలెక్టరేట్ కార్యాలయం కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్లు, RDO, MROలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా రెవెన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా అసైన్డ్, భూదాన్ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.