TPT: నాయుడుపేటలోని స్వర్ణముఖి నదీ తీరాన వెలసిన శ్రీశ్రీ ప్రసూనాంబ సమేత నీలకంటేశ్వర స్వామి దేవస్థానంలో నాగలింగేశ్వర స్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. కాగా, ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేపట్టారు.