NLR: స్వచ్చ ఆంధ్ర-స్వర్ణ ఆంద్ర కార్యక్రమములో భాగంగా జిల్లా స్ధాయిలో జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయమునకు “స్వచ్చ ప్రభుత్వ కార్యాలయము కేటగిరిలో” అవార్డు రావడం చాలా సంతోషకరముగా ఉందని జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అన్నారు. ఈ అవార్డు పొందుటకు నాతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులు నిబద్దతతో కార్యక్రమంలో పాల్గొన్న వారికి శుభాకాంక్షలు తెలిపారు.