GDWL: హీరో విజయ్ దేవరకొండ కారుకు ఉండవెల్లి సమీపంలో సోమవారం ప్రమాదం జరిగింది. పుట్టపర్తి నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా, విజయ్ ప్రయాణిస్తున్న లెక్సస్ కారు ముందు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. బొలెరో ఒక్కసారిగా కుడివైపుకు టర్న్ చేయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ఘటనలో విజయ్ దేవరకొండకు ఎలాంటి గాయాలు కాలేదు. కారు స్వల్పంగా దెబ్బతింది.