ADB: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణ నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సోమవారం ఏఎస్పీ కాజల్ సింగ్తో కలిసి జిల్లా లోని పోలిస్ అధికారులతో జిల్లా ఎస్పీ సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేశారు. ఎన్నికలలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా విధులు నిర్వర్తించి ఎన్నికలను సమిష్టి కృషితో పూర్తి చేయాలన్నారు.