SKLM: టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని సాంఘీక సంక్షేమ సమీకృత బాలికల వసతి గృహాన్ని సోమవారం రాత్రి రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ సీహెచ్. విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న మెనూని పరిశీలించారు. వసతిగృహంలో భోజనం నాణ్యతపై విద్యార్థినిలను అడిగి తెలుసుకున్నారు. ఈయనతో పాటు పలువురు జిల్లా అధికారులు ఉన్నారు.